17, మే 2009, ఆదివారం

ఆశువు

ఆశువు

కాంతిలేని కానరాని దారిలోన, రాత్రిలోన
యువరాజుగ అచ్చెరువున, అబ్బురమున కాంచినాను ఆనాడు.
పల్లకిలో దివ్యజ్యోతి కోటికాంతులన్ని కలసి
పల్లకిలో ఇమడలేక, నిలువలేక, నా మనసును నిలువనీక
నా కన్నులు చేరెనానాడు!

మల్లెల్లో తీగలాగ, పాదానికి పారాణిలాగ
నా కన్నుల సొనలలాగ, నా మనసునావ తెరచాపలాగ
పంచభూతాల, అష్టదిక్పాలకుల, ముక్కోటిదేవతల
అవే కోటికా౦తుల మహామంగళసూత్రాలతో పెళ్ళికళాదివ్వెగ
నా ఇల్లు చేరెనీనాడు!

5 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

ఏదో విశేషముంది ...మీ కవితలో ...

మరువం ఉష చెప్పారు...

మొత్తానికి మనో పల్లకీలోని మగువ, మీ ఇంటి ప్రాంగణంలోకి వచ్చేసింది, ఆ నడుమ పయనం మధుర కావ్యాలు లిఖింపచేసింది, ఈ గమనం అంతే ప్రణయ రాగాలు వినిపించనుందేమో. చెలిమి గంధాలు, వలపు పారిజాతాలు కలబోసి మాకిక యుగళ గీతాలు వినిపించనున్నారన్న మాట!

సమిధ ఆన౦ద్ చెప్పారు...

మీరు కవితలో చదివిన విశేషమే పరిమళ గారూ, ఇది కవిత కాదు, ఆశువుగా నేరాసిన నా జీవితంలోని ఓ మధుర సన్నివేశం. భలే కనిపెట్టారు! నా బాచిలర్స్ డిగ్రీని శాస్వతంగా పోగొట్టుకున్న ఆనందంలో రాసిన కవిత.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

గీతాల సంగతెలా ఉన్నా, కవితల్ని మాత్రం వినిపిస్తాను. ఆల్రెడీ అలవాటులేని పెళ్ళి జీవితాన్ని అనుభవిస్తున్నాను. అందుకని అలవాటున్న కవితావ్యాసంగం సులువు కదా. ఏమంటారు ఉషగారూ?

మరువం ఉష చెప్పారు...

"అలవాటులేని పెళ్ళి జీవితాన్ని" అన్నీ అంతే కొత్తగా మొదలెట్టినప్పుడు, ఆ తర్వాత అవే అలవాట్లు, గ్రహపాట్లూను ... jk కనుక హరివిల్లు వన్నెల గీతాలూ వస్తాయి. మీ కవితలకై ప్రతీక్షిస్తూ..