స్వర్గాన్ని చేరాను
ఆ దూరాల తీరాల మేఘాలతో ఆనాడు
ఏ కబురాటలాడానో, ఏం మాటలాడానో!
ఆ కబురంత మూటల్లె మనసంత నింపుకుని
మేఘాల మాటునున్నదేవుళ్ళకే విన్నపాలుగా పంపించెనో!
ఈనాడు ఈదరిన గోదారి తీరాన మనసార
పరవళ్ళు తొక్కుతున్న నా నవ్వు ఏ దేవతల వరమో!
నా గాలి, నా నీరు, నా వారి మనసిల్లు ముంగిటిలో
విలసిల్లు స్వర్గాన్ని ఏ మయుడు నిర్మించెనో!
దేవుడే స్వర్గాన్ని నా నుంచి దూరంగ చేయంగ ఏ జీవితసారాన్ని నేర్పించెనో!!
గారాల మా అమ్మ ఆ రోజు మారాముజేసింది, నా చెయ్యి వదలనంది
నా గొంతు సడిలేక, తన ఒడిలోన నేలేక, తన కళ్ళలో నిద్ర ఎన్ని రాత్రుల దూరమయ్యెనో!
వద్దంటే విననంటు, దూరాలు వెళ్ళాలి, లోకాలు చూడాలి
నా తలపైన చెయ్యేసి, ఓ నవ్వు విసిరేసి పంపించమంటూంటే తన గుండె ఏ బాధలనోర్చెనో!
బాధ ఎంతైన, భాద్యతయె మిన్నంటు, దేవుళ్ళు రక్షంటు
నాకు ఆశీస్సులిచ్చేటి, నా చెయ్యి వదిలేటి ధైర్యాన్ని తనకు నాన్న మాటలే ఇచ్చెనో!
లోకాన్ని కాస్తంత చూసాను, కష్టాల్ని ఓర్చాను, జీవితం చదివాను
తెలిసింది గోరంత, కొండంత మిగిలిందని తిరిగిచ్చి అమ్మకెన్నెన్ని కబుర్లు చెప్పానో!
నేడు మా అమ్మ కన్నుల్లో నా మోము చందాలు, చందమామనే మించెనో!!
దూరాలకేగావు, తీరాలు దాటావు, పాఠాలు నేర్చావు
నీ నేర్పు ఏ మార్పు కోసమో, నీ అనుభవమే దారి చూపునో!
పప్పేసి, నెయ్యేసి, ఆవకాయ నంచేసి భోంచేసి
ఎన్నాళ్ళు గడిచెనో, మీ అమ్మ చేతిముద్ద కోసమింకెంత ఆగగలవనో!
రాళ్ళైన, ముళ్ళైన, నీరైన, నిప్పైన నీ దారిలో నడక
రాదారి కావాలి, పూదారి కావాలి, నీ పిల్లలకదే నవమార్గమవ్వునో!
ఆకాశమే హద్దు, ఆలోచనే వద్దు, నీ చేతి వేలుకై
నా చెయ్యి సిధ్ధమై అదనుగా ఉంచుతానన్న మా నాన్న మాటల్లొ ఏనిధి దాగెనో!
ఆ నిధియె శ్రీనిధిగ అవసరాన కాపాడి నన్ను నిలబెట్టిన క్షణాలు ఎన్నని చెప్పనో!!
రాగాల సరాగాల రసరాగాల విరహరాగాలు
వినిపించి వినిపించి మూగబోయిన కళ్ళు ఏ ప్రశ్నలేసెనో!
నిను చేర నా మనసు ఎగిరెగిరి పడిపోయె నను చేరమని బతిమాలిన
నా చెలి కళ్ళ తడిమెరుపులు నను చూసి ఎన్ని నవ్వుల్ని ఒలికించెనో!
ఇన్నాళ్ళ ఈ దూరమింకెన్నాళ్ళ కాలమని భయపడిన
తన గుండెచప్పుళ్ళ వేగాన్ని ఏంచెప్పి ఓదార్చనో!
నా మీద చెయ్యేసి, నా గుండెపై తలవాల్చి, నా ఊపిరిని కప్పుకుని
నా మనసుతో గుసగుసలాడతానన్న తన నిద్రసొగసుల్ని ఏ కవితలో దాచనో!
ఏడడుగులేద్దాము పదమంటు లేపాను, నవ్వుతూ నడిచాము, ఏ జన్మ సంబంధమో!
ఇన్నాళ్ళ దూరాన్ని దూరంగ నెట్టేసి
నా దేశమొచ్చాను, నా ఇంటికొచ్చాను, నా వార్ని చూసాను.
భాద్యతల లెక్కల్ని బేరీజు వేసాను, ఆలోచనల ఉరుకును పదమంటు తోసాను
కాలానికి తగ్గ నిర్ణయం చేసాను, దేవుడికి నా ఆశల మూటప్పజెప్పాను.
సూర్యుణ్ణి చూడాలి, పలకరించాలనుకుంటు మేడెక్కి
నింగిలోకి చూసాను, ఇంటి వెనకున్న గుడి గంట మోతల్ని మనసార విన్నాను.
చంద్రుణ్ణి చూడాలి, ఎంత మారాడొ అనుకుంటు తిరిగి రాత్రికెళ్ళాను
కొబ్బరాకుల్లోంచి తొంగిచూస్తున్న వాడితో దోబూచులాడాను.
మది నిండ హాయితో, కనులంత నీరుతో, నా గాలి పీల్చాను, నింగినే కౌగిలించుకున్నాను.
నిజమో, మాయో, చిత్రమో
బంధాలతో మనిషికున్న ఈ బంధాన్ని ఏ పేరుతో పిలువనో!!!
------
ప్రపంచ బాధను నా బాధగ వర్ణించి లిఖించేంత శక్తి వయసు అర్హత నాలో ఇంకా రాలేదు. అంత వరకూ, నా బాధలన్నీ, ఆనందాలన్నీ మీవే. (నన్ను నేనెవరితోనో పోల్చుకుంటున్నానని అపార్ధం చేసుకోరని ఆశ. నా అర్హతనీ స్థాయినీ తెలుసుకునే మసలుతాను.)

13 కామెంట్లు:
nice chala bagumdi, keep it up
"మది నిండ హాయితో, కనులంత నీరుతో, నా గాలి పీల్చాను, నింగినే కౌగిలించుకున్నాను." -- Excellent.
Although big, excellent narration...
ఎంతైనా మీ బాణియే వేరు ఆనంద్, నిరుపమానమది. నాకు ఆ స్వర్గానికి అతివేగంగా వచ్చిపడాలనిపించింది.
అయినా చూసారా,స్వర్గాన్ని వీడాను అని వగచినంత సేపు పట్టలేదు తిరిగి పదిలంగ ఆ గూటికి అమ్మ ఒడికి చేరిపోను.
"చంద్రుణ్ణి చూడాలి, ఎంత మారాడొ అనుకుంటు తిరిగి రాత్రికెళ్ళాను
కొబ్బరాకుల్లోంచి తొంగిచూస్తున్న వాడితో దోబూచులాడాను."
ఎందుకో వున్న ఈ కొంచం సామ్యానికి ఈ నా పదం గుర్తొచ్చింది...
"చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి, నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?"
నమస్కారం హనుమంతు గారూ, బహుసా మీ రాక ఇదే మొదటిసారనుకుంటా. మళ్ళీ మళ్ళీ తప్పకరావాలి మిత్రమా! మీకు నా పని నచ్చినందుకు చాలా సంతోషం.
ప్రదీప్ గారూ, ఓ Baawarchi చెప్పినట్టూ, it is simple to be tough, but it is very tough to be simple! నేనూ అదే కష్టాల్లో ఉన్నానండీ! మరీ ముఖ్యంగా మా నాన్నగారు రాయడం గురించి చెబుతుంటారు. పెద్ద పెద్ద వాక్యాలూ, పెద్ద పెద్ద ఆలోచనలతో రాయడం పెద్ద కష్టమేమీ కాదూ అంటారాయన. పెద్ద ఆలోచనల్ని కూడా సులువైన మాటల్లో సంక్షిప్తంగా రాయగలిగిన రోజు, నువ్వు నిజంగా రచయితవౌతావూ అన్నారు. ఇంకా కృషి చేస్తున్నా, చూద్దాం! మీకు నా కవిత నచ్చినందుకు, మీరు నా బ్లాగు వైపు వచ్చినందుకు మాత్రం చాలా ఆనందిస్తున్నాను సుమా!
ఉష గారూ, మీరూ నేనూ కూడా ఒకే విషయాన్ని ఒకరికొకరు తెలీకుండా మన కవితల్లో చొప్పించడం ఓ రకంగా విచిత్రమే అయినా, మరో రకంగా చూస్తే చాలా సాధారణ విషయం! ఎందుకంటే, నేను చంద్రబింబం సిగ్గు పడుతోంది అంటే, మీరు చందమామ కన్నుగొట్టాడూ అనొచ్చు. మనలో ప్రకృతిలో భాగం కాని వారెవ్వరూ, ఆ ప్రకృతిని కనీసం మనసులో అయినా వర్ణించి కవితలల్లని వారెవ్వరు చెప్పండీ! ఈ దశగా ఆలోచిస్తే మనందరమూ చుట్టాలమూ బంధువులమే కదండీ!
నాకూ శైలి ఉందని చెప్పి నాకో చిన్న నిచ్చెన వేసారు. మీరన్నందుకైనా అది నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. థాంక్యూ వెరీ మచ్!
ఆనంద్ గారూ ! జీవనసహచరి ఆగమన శుభాకాంక్షలు . అమ్మ మనసును , నాన్న అండదండల్ని అందంగా రాశారు .
"మది నిండ హాయితో, కనులంత నీరుతో, నా గాలి పీల్చాను"
ఆ ఆనందం మాదే అన్నంత అనుభూతి కలిగిందండీ చదువుతుంటే....
@ఉష గారు,
మీరు రాసిన "చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుకనుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి, నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక? " చదువుతుంటే "ఇరులు నిశాచరులు...." అంటూ విశ్వనాధ వారు రాసిన తామసి పద్యం గుర్తుకొచ్చింది.
అంటే అర్ధంలో సామ్యముందని కాదు, నడకలో సామ్యం వల్లనన్న మాట.
@ఆనంద్ గారు,
నాకూ ఇంచుమించు అలాంటి జబ్బే ఉంది. మైక్రో లెవెల్ థాట్ ని మిల్లీ సైజుకి తేవడానికే బోలెడు కష్టపడతాను. మీరు ఏకంగా మెగా సైజుకి తీసుకెల్తారు. మీ బలహీనత అనుకున్న బలం నాకు లేదు.
ఇలా ఒకదాన్ని మించి ఒకటి కవితలు రాసేస్తుంటే కామెంటడానికి మాకు ఏం రాయాలో అర్దం కావడం లేదు .. కాబట్టి ఈ సారి కాస్త తప్పులతో రాయండి చదివి ఏదో ఒకటి సలహా ఇస్తూ ఉంటాం :) చాలా బాగా రాసారు
* ప్రదీప్, మీరు చెప్పిన "విశ్వనాధ వారు రాసిన తామసి పద్యం" విషయానికి చాలా ధన్యవాదాలు. ఆనంద్ వ్రాసిన దానికి భావ సామ్యం లేదు కానీ http://maruvam.blogspot.com/2009/01/blog-post_17.html ఆ కవిత "ఈ గీతానికి నువ్వే పేరుపెట్టు - ప్రేమని మాత్రం వద్దు" కూడా నేను చాన్నాళ్ళ క్రితం ఆసంపూర్తిగా వదిలేసి ఈ మధ్య పూర్తిచేసాను. ఎందుకో కొన్ని అలా వూహల్లోకాసేపు వూరేగి పూర్తిగా వెలికి రానని మొరాయిస్తాయి, మళ్ళీ ఎపుడో ఒకసారి ఉరుకురికి వస్తాయి. చిన్న స్వార్థం, ఈ మాటలు నేను నా కవితకి జోడిస్తాను. ఎప్పటికైనా ఆ రచన, విశ్వనాధ వారు రాసిన తామసి పద్యం చదవటానికి గుర్తు వుంటుంది. సమయాన్ని బట్టి మరువం పాత టపాలు తిరగేసుకోవటం అలవాటు.
* ఆనంద్, "మనలో ప్రకృతిలో భాగం కాని వారెవ్వరూ" అని ఒక్క మాటలో చెప్పేసారు. నా వరకు ప్రకృతిని శ్వాసిస్తూనే జీవిస్తాను. అలాకాని నాడు నేను వుండగలనా అన్నది నాకు తెలియదు. అవును మనమంతా కవులం, భావ లోగిలి కాపురస్థులం. వూహా బాటసారులం. ప్రదీప్, మీరు ఈ రకంగా కవితోపాఖ్యానంలోఒకలవటం నాకు ఆనందంగా వుంది. అది, మిమ్మల్ని ఒకరికొకరిని పరిచయం చేయటం, నేను అనుకున్నదే, అదే జరిగింది. సంతోషం.
ప్రదీప్ గారు, భలే చెప్పారు. కొండంత బలాన్నిచ్చారు. మీరన్నట్టూ, నా బలహీనతే నా బలమేమో!
నేస్తం గారూ, భలే వారే, సాహితీ శ్రేయోభిలాషి కాబట్టి నాలో తప్పులు మీకు కనిపించలేదేమో! అయినా మీ కోరిక తీర్చడం నాకు చాలా సులభం, వెంట్రుకవాసి, తప్పకుండా నెరవేరుస్తా పలుమార్లు.
ఉషగారూ, మీవంటి కవితోపాఖ్యానోపాసకులు స్నేహితులు కాగా మీతో చెయ్యికలపడానికి నాదేగా భాగ్యమూ! అల్లాగే ప్రదీప్ గారూనూ. ఎంతో నేర్చుకోబోతున్నానని మహదానందంగా ఉంది లోలో. ఎందరో మహానుభావులు.......వారిలో కొదరిలా నా మిత్రులు! సగర్వి మాటలివి!
కామెంట్‌ను పోస్ట్ చేయండి