26, జూన్ 2009, శుక్రవారం

రంగులు

ఉషగారి మరో కవిత నాతో రాయించిన ఓ చిన్నిగీత! ఈ స్ఫూర్తికి దీర్ఘాయుష్మాన్ భవ! పెద్దలూ, మీరూ దీవించండి!
రంగులు

Align Centerనీవెవరు???

వాననీటిచుక్క నుదుటిపై కదలాడే నూనె బొట్టుని
ఉధృతమై జాలువారే ఆకాశగంగ కట్టే చీరకు పవిటంచుని
పొగమంచు రాత్రి రాజ్యంలో కాగడరాజుకు కిరీటాన్ని
రవివర్మకు హస్తభూషణాన్నీ, కవిచంద్రులకు ఇష్టసఖిని
మయూరాల పాదాభివందనమందుకునే నటరాణిని
చందమామ పీడకలల భయంలో అతడికి శ్రీరామ రక్షకవచాన్ని
సంధ్య నింగి పలకపైన మేఘాలకుంచె వేసిన బొమ్మని
విష్ణుచక్ర విలువలో సగభాగాన్నీ, ఆ హరి విల్లుని
ఎండవాన సంగమానికి మరులు పెంచే మధురరతిని
నీలాంటి వారెందరికో మరువలేని వదలలేని మధురానుభూతిని

నేనే ఇంధ్రధనస్సుని!!!

16 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

కవిత చాలా బావుంది "సంధ్య నింగి పలకపైన మేఘాలకుంచె వేసిన బొమ్మని"
ఈ లైను మరీ అందంగా అమరింది .

Unknown చెప్పారు...

భలే ఉంది, మొత్తం ఒక్క ముక్కలో చెప్పారు.

మరువం ఉష చెప్పారు...

ఆనంద్, ఇంత వరకు అనసూయను. ఇప్పుడు క్రొత్తగా ఆ విద్య నేర్పుతున్నారు. చాలా గాఢంగా, ఎంతో మరెంతో బాగా వ్రాసారు. నిజానికి ఇప్పుడు నా కవితకి ధన్యత చేకూరింది. కృతజ్ఞతలు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మరువలేని వదలలేని మధురానుభూతిని కలిగించింది మీ కవిత

మరువం ఉష చెప్పారు...

ఆనంద్, మీకున్న కవితాతృష్ణకి, భాషా కౌశలతకి నిజానికి మరువం తోడు అవసరమా, నన్ను అందలం ఎక్కించటానికి కాకపోతే. నెనర్లు మిత్రమా. నా 100 వ టపాకి ఏమి రాయాలా అని యోచిస్తున్నపుడు ప్రదీప్ చక్కని హరివిల్లు సంకల్పించి, అందులో నాకు పాలు పంచిచ్చి ఒక మరువరాని అనుభూతినిచ్చారు. . మీరు ఈ కొసమెరుపుని జోడించటం హరివిల్లు వెనుగ్గా విశాలమైన ఆకాశం మాదిరిగా అనిపించింది. ఇరువురికీ నా ధన్యవాదాలు అంతకు మించిన కృతజ్ఞతలు. సాహిత్యం సముద్రమైతే అరచేతులతో తోడుతున్న భావన. ఇందుకోసమైనా మరిన్ని చేతులు చేయి చేయి కలిపి వస్తామంటే అన్న భావన. ఇక మీలోని స్ఫూర్తి ఆరని జ్యోతి. అయినా అనుకున్న స్వర్గాన్ని చేరి అమర సుఖాస్వాదనలో వున్నారు. మీకిక ఎదురేది? ;)

Bolloju Baba చెప్పారు...

wonderful expressions.

just like a rainbow itself.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

పరిమళగారూ, పలుకుతున్నప్పుడు పదకదలికలు ముఖకవళికల్లా నాలుకకు పదునుపెట్టే చక్రంలా కవితలు రాయాలని ప్రయత్నించినప్పుడు, ఇలాంటి అమరికలే వస్తుంటాయి. నచ్చినందుకు సంతోషమండీ.

ప్రదీప్ గారూ, ఆలస్యమైనా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పనికి ఓ గుర్తింపునిచ్చారు.

ఉషగారు, ఇలా ఇన్నిన్నిసార్లు మనలోమనం కృతజ్ఞతలు మాత్రమే తెలియజేస్కుంటూపోతే ఇక మీరన్న సాహితీ సముద్రాన్ని చిలికేదెప్పుడు, అమృతాన్ని సంపాదించేదెప్పుడూ చెప్పండీ. అయితే ఒకటి, మీరిద్దరూ నాకిచ్చిన కితాబుకి, గౌరవానికీ నిజానికి నేను కూడా పదేపదే చెబుతుండాలనుకోండీ (అంటే చెపుతున్నానన్నమాట.) ఇక మీరన్న అమర సుఖాస్వాదనార్ణవంలో ధుర్యోదనుడిలా జలాంతర్యోగా చేస్తూ దివ్యానందాన్ని ప్రతిరోజూ అనుభవిస్తున్నాను.

బాబా గారూ, థాక్యూ వెరీమచ్. Your comment added its color to my rainbow. It is complete now!

నేస్తం చెప్పారు...

నేను కుళ్ళుకుంటున్నాను మీ కవితలు చూసి :)

ఆత్రేయ కొండూరు చెప్పారు...

aanand gaaru..mii indra dhanassu caalaa baagundi. Emiti ilaa indra dhanassutO aapeSaaru ? aa taravata vaanostundani eduru cuustunnaanu. kaasta time tiisukuni kuripincandi.. ikkada endalu mandutunnaayi mari.

శివ చెరువు చెప్పారు...

అద్భుతం..

విశ్వ ప్రేమికుడు చెప్పారు...

చాలా బాగుంది. మీ కవితా స్ఫూర్తికి దీర్ఘాయుష్యమస్తు. :)

సమిధ ఆన౦ద్ చెప్పారు...

నేస్తం, ఆత్రేయ గారూ, ఓ కవితలో స్వర్గాన్ని చేరానని చెప్పి, మరో కవితలో సప్తవర్ణావిష్కరణాయత్నము చేసి, చివరికి నాకు తెలియకుండానే సుకవిత్వానికి సుమారు సప్తార్ణవాల దూరంలోకి వచ్చిపడ్డాను. ఆ లోకం పేరే నిజలోకం. ఈ లోకంలో ఎండా వానా అన్నీ ఒకేలా కనిపిస్తాయి మరి. కవిత రాయాలంటే స్వప్న౦లోనే ఉండాలని కాదు నా బాధ, కాని నాలాంటి స్వాప్నికుడికి ఆ అవకాశం లేకపోతే మాత్రం కవిత ఇక నాకు తాత్కాలికంగా దూరమైనట్టే. అందుకే ఈ ఆలశ్యం, అందుకే ఈ క్షమాపణ. నేస్తం గారూ, మీరు రాసే ఆహ్లాదకరమైన జీవకథలు రాయలేనని నేనూ చాలా సార్లు కుళ్ళుకున్నాను, తెలుసా!

సమిధ ఆన౦ద్ చెప్పారు...

శివ గారూ, ఒకా మాటలో నా కవిత చదివిన మీకు కలిగిన అనుభూతిని ఇంకా అద్భుతంగా చెప్పేసారు. సంతోషం.

విశ్వప్రేమికుడు గారూ, తథాస్తు! శతకోటి ధన్యవాదాలు! తప్పక మళ్ళీ రండీ!

aswinisri చెప్పారు...

wah! simply wonderful

aswinisri చెప్పారు...

wah! simply wonderful

సమిధ ఆన౦ద్ చెప్పారు...

Thank you very much and of course, I am very sorry for the delay Aswini Sri garu!!