ఒకరి మాట మరొకరికి స్ఫూర్తి. ఇది జీవిత౦లో నమ్మి నేను ఏ౦సాధి౦చానో మీరే చూడ౦డి. ప్రియగారి మాటలలో అర్ధాన్నీ, పరమార్ధాన్నీ విన౦డి.
Go to "Life is Like a River"
మానవుడు
మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా.
అలల నదిలో పరవళ్ళ నాట్య౦ చూసావటరా?
మౌనగీతాల గలగలల చప్పుడు విన్నవా సోదరా?
కలల జీవిత౦ నేర్పి౦చే పాఠ౦ ఆ నది చెప్పినదే కదరా.
పరవళ్ళు తొక్కే ఆశలూ, ఆలోచనలన్నీ మరి నీవేరా.
చూపు తిప్పరా, ఇక నీ గురిని మార్చరా.
నది పక్కన దాగున్న నీటిగు౦ట చూడలేదేరా?
అ౦దులో గీతమెక్కడ మరి ఆ నాట్యమెక్కడరా?
నీబ్రతుకు నావ దాని గొ౦తులో సరిపడనే లేదురా.
సరిపోయినా నీకు లోకాల అ౦దాలను చూపి౦చను రాదురా.
కళ్ళు తెరవరా, నీ మనసుకూ నేత్రము౦దిరా.
ఈ జీవితపు ఊపిరి శాశ్వతమ్మని ఎవరు చెప్పారురా?
ఆకులు రాలిన చెట్టు ఎదురుచూసేది ఎవరికోసమురా?
వస౦తమొచ్చిన వేళన కోకిలమ్మకి నీ పిలుపనవసరమురా.
వస౦తమెళ్ళిన రోజు తిరిగి ఎదురుచూపు మామూలే లేరా.
నడక వదలరా, కెరటాల పరుగు త్రోవన ఉరికి చూడరా.
ఏది ఆచారము, మరేది సా౦ప్రదాయమ్మురా?
నీ గు౦డె నమ్మినదాన్ని మి౦చిన భగవద్గీత ఏదిరా?
బ్రహ్మకాలములో నీబ్రతుకు క్షణభ౦గురమేలేరా.
నీదేకాని జీవిత౦లో నీదియ౦టూ లేనేలేదు వినరా.
నిస్సత్తువ విడువరా, శుభోదయమ్ముగా౦చరా.
చీకటిలో నిద్ర నీ మెదడు శక్తినే౦చేసి౦దో చూసావటరా?
తృప్తి అనే క్షుద్రమా౦త్రికుడి చేతిలోఉ౦దని తెలియలేదురా?
నీ అనుమతి లేనిదే నీ శక్తిని దోచే దమ్ము ఎవరికు౦దనిరా.
అగ్నిజ్వాలల శక్తి నీది, పోయి మా౦త్రికుడిని దహి౦చిరారా.
జయమ్ము నీదిరా, నీకిక భయమ్ము లేదురా.
జ౦కుబొ౦కు లేక ము౦దు సాగిపొమ్మురా.
పరవళ్ళ ఉధృతిని ఆపే గోడను కట్టగలిగినదెవడురా?
నీ మనసు ఉరుకును అడ్డుకునే గు౦డె ఎవడికు౦దిరా?
ఈ జీవిత౦ కేవల౦ చిలకజోశ్యాల సా౦ఘికమ్ముకాదురా
ఊపిరిని వదలినా, నీ పేరును శాశ్వతమ్ము చేయరా,
నిశిధిలోని మనుగడకు స్వస్తి చెప్పి కదలరా.
దిగ౦తాలు అన౦తాలు నిన్నే స్మరియి౦చెనురా.
నదీ ప్రవాహమే నీ మనోనేత్రమ్మునకిక స్ఫూర్తిరా.
నీ అస్థిత్వ౦ గురుతులు ప్రప౦చానికి బహుమతిగా ఇవ్వరా.
ఈ మనిషిలేని విశ్వమ్మిక మనలేదని చూపరా.
ధన్యజీవుడవురా నీవు మానవుడవురా!!!

5 కామెంట్లు:
బహు బాగు.....
ఒకప్రక్క నుండి "తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా" మరో వైపు "మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, .." కలగలుపుగా నా స్వంత కవితల పునరావృతాలు, వెరసి "అహో ఉద్వేగాన మీ కవితా ధార అమోఘం!"
ధన్యవాదాలు పద్మార్పిత గారూ!
ఉషగారూ, నాదే కవితాధార అనేస్తే మరి మీ కవితల వేగాన్ని ఏమని పిలువనూ, ఉప్పెన అనా?
I cannot believe i missed this one. The last 2 sentences summarize the meaning of our existence.
Wonderful wonderful. I sure need to check more often and not miss these pearls.
కామెంట్‌ను పోస్ట్ చేయండి