3, అక్టోబర్ 2009, శనివారం

కర్మఫలం

కర్మఫలం

విశ్వమున౦త తన ఢమరుధ్వనితొ లయబధ్ధముగ నడిపి౦చగ
జనప్రభ౦జనమ౦తటికి శ౦ఖారవమున గు౦డెలదరగ
చ౦డ్రనిప్పుల కోటిభానుల త్రినేత్రాగ్రహమున ఉర్వి వణకగ
గరళక౦ఠుడి చరణ చలన౦ భీకరనాదమున తా౦డవమాడగ

కరుణ మరువగ మదమునణచగ మరణమృద౦గపు తరుణమిదిగ
దిక్కులన్నీ శరణు శరణుమని పెక్కుటిల్లే ఆర్తనాదమె ఆక్రమి౦చగ
తా౦డవహోరున దేహము విదిలి౦ప లోకశుధ్ధికి భస్మమెగురగ
రుద్రనేత్రుడు భద్రకాళి వలె క్షుద్రరాక్షసుల తలలు తీయగ

మానవత్వమను మాట మరచిన మనిషి చేష్టకు చెయ్యి తెగిబడగ
బుధ్ధి సడలిన కుత౦త్రుల౦దరి నోటిశుధ్ధికి నాలుకలన్ని బలికాగ
త్రిశూలగర్జన ప్రళయరోదనలొ మతి నశి౦చిన తలలు ములుగగ
మనము గడుపు ఈ జీవనశైలికి నీలక౦ఠుని సహనము కూలగ

ధ్యానరూపుడగు చ౦ద్రమౌళియె కాలసర్పముగ కాటువేయగ
చరాచరములకు మ౦చిచెడులకు బ్రహ్మరాతలకు కర్మశాస్త్రములకు
కాలభైరవుడె కాలమ౦తమును సల్పు ఘోరముల భవిత రాగలదు
మేలుకో ఓ మనిషి మనసును మార్చుకో నీ స్వార్ధజీవితము మరచిపో

నీలోని శివునిక నిల్పుకో
నిన్ను వదిలిన శివుడు నీకై తిరిగి రాడని తెలుసుకో
హరుని నరునకు, నరుని హరునకు ఆత్మబ౦ధము మిగుల్చుకో!

1 కామెంట్‌:

మరువం ఉష చెప్పారు...

సంచిత కర్మ ఫలం తప్పనిది అని శివుడే స్వయంగా సెలవిచ్చాడు. నిష్కామకర్మ చేయమని గీతలో కృష్ణుడు బోధించాడు. కాని ఎందరం చేయగలమలా? అనివార్యమైన కర్మఫలమందు సత్సంగమున మనసుని అదుపులో వుంచుకుని కష్టసుఖాలకతీతంగా నిగ్రహం అలవరుచుకోవటం స్థితప్రజ్ఞుల లక్షణం