సపూర్ణ పౌర్ణమి రేయి
నిరూపమైన చిరుగాలుల్లో
వెండివెన్నెల పుష్పవిహారం
అలల గలగలలు లేని సరస్సుల్లో
ముగ్ధమనోహర చంద్రబింబం
మనసానందించిన వేళ
మృదు మనోవీణ పలికే మధుర సంగీతం
అటువంటిదే అనాలికదా
సంధ్యా దాటిన తర్వాత ఈ వాతావరణం
ఈ సమయంలో తారాతీర ప్రయాణం
మనసైన కవికి ఎంతో ఆత్రం
ఆ కవికి మైకంలో పదునాల్గు భువనాల
సత్సందర్శనా సవిధం
ఈ వేళలో సందర్భానుసార నిశ్శబ్ధమే
మధురమైన అన్నమయ్య సంకీర్తనం
వెన్నెల కిరణాల నీడలో మనసు పాడే
ప్రకృతీ వర్ణన సహిత గానామృతం
నింగిలోకి తొంగిచూస్తే కానవస్తుంది
ఊహించని ఊహల మరో ప్రపంచం
దానిని కాంచే నయనాలలోనే
బంధించబడేనా సంపూర్ణ జగద్గోళం
ఆ వెన్నెల గాలులు సోకి
మది చేసెను భరతనాట్యం
ఆ నక్షత్రపు నల్లని నింగిని చూసి
పాడెను ఆపాత మధురగీతం
అమ్మ ఒడిలోనే ఉయ్యాలలా
నెలవంక నీడలో కవి హృదయం
ఆ ఒడిలో వినిపించే జోలపాటలా
వెన్నెల పందిరిలో కవితాసాహిత్యం
మబ్బుల తలగడా వేసుకుని
ఆకాశం చూస్తూ తలవాల్చిన సమయం
వెండి గిన్నెలో చందమామను చూసిన
చిన్ని కృష్ణుని బోసినవ్వులే అందుకు అన్వయం
నిరూపమైన చిరుగాలుల్లో
వెండివెన్నెల పుష్పవిహారం
అలల గలగలలు లేని సరస్సుల్లో
ముగ్ధమనోహర చంద్రబింబం
మనసానందించిన వేళ
మృదు మనోవీణ పలికే మధుర సంగీతం
అటువంటిదే అనాలికదా
సంధ్యా దాటిన తర్వాత ఈ వాతావరణం
ఈ సమయంలో తారాతీర ప్రయాణం
మనసైన కవికి ఎంతో ఆత్రం
ఆ కవికి మైకంలో పదునాల్గు భువనాల
సత్సందర్శనా సవిధం
ఈ వేళలో సందర్భానుసార నిశ్శబ్ధమే
మధురమైన అన్నమయ్య సంకీర్తనం
వెన్నెల కిరణాల నీడలో మనసు పాడే
ప్రకృతీ వర్ణన సహిత గానామృతం
నింగిలోకి తొంగిచూస్తే కానవస్తుంది
ఊహించని ఊహల మరో ప్రపంచం
దానిని కాంచే నయనాలలోనే
బంధించబడేనా సంపూర్ణ జగద్గోళం
ఆ వెన్నెల గాలులు సోకి
మది చేసెను భరతనాట్యం
ఆ నక్షత్రపు నల్లని నింగిని చూసి
పాడెను ఆపాత మధురగీతం
అమ్మ ఒడిలోనే ఉయ్యాలలా
నెలవంక నీడలో కవి హృదయం
ఆ ఒడిలో వినిపించే జోలపాటలా
వెన్నెల పందిరిలో కవితాసాహిత్యం
మబ్బుల తలగడా వేసుకుని
ఆకాశం చూస్తూ తలవాల్చిన సమయం
వెండి గిన్నెలో చందమామను చూసిన
చిన్ని కృష్ణుని బోసినవ్వులే అందుకు అన్వయం
3 కామెంట్‌లు:
మీతోపాటుగా ఈ అనుభూతిని నేనూ అంతే అచ్చంగా చూసేసాను. చాలా మధురమైన వ్యక్తీకరణ. మా ఇంటి వెనుక సరస్సులో మబ్బులు ఆ సాయంసంధ్యా సమయంలో ఎంత వయ్యారంగా సింగారాలు పోతూ అలంకరించుకుంటాయో నేనూ త్వరలో వ్రాయాలి అనిపించింది..
Just a sampler of my works: http://maruvam.blogspot.com/2009/01/blog-post_04.html
though I do not like to be inclined or biased to any one of those.
నా వెన్నెల మీద మీ వ్యాఖ్యను చూసి మీ చుప్పనాతి సూరీడు గుర్రుమ౦టాడేమోన౦డీ ఉషగారు.
మీ వ్యాఖ్యకు కృతఘ్న్యతలు!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి