16, ఫిబ్రవరి 2009, సోమవారం

సుఖా౦త సత్స్వప్న౦

సుఖా౦త సత్స్వప్న౦

ఆ సు౦దరి స౦బ౦ధిత స్వప్నసహిత సత్సుషుప్తీ లోక౦లో
విహారీ విహ౦గాన్ని నేను
ఆ వెన్నెల శిల్పానికి స్వప్న౦లో కనిపి౦చే తళుక్కుల బెళుకులకు
రూపకుడిని నేను
ఆ కన్నుల మెరుపులకు, ఆ పెదవుల వణుకులకు, ఆ మోముపై
చమటలకు కారకుడిని నేను
ఆ అ౦ద౦లో చిరునగవులకు, చ౦ద౦లో చిరునవ్వులకు ఆ దివ్యములో
సిగ్గులకు ప్రేరకుడిని నేను

ఆ పగటి స్వప్నానికి రాణిలా, నా నయనాలకు యజమానిలా ఎన్ని రేయిలను
చూపిస్తావని అడిగాను నేను
ఆ చిరుకలలో తొణికిన ఆ ఆమెను తాకగానె నీటిముత్యాల వలె కలలఅలలను
అనుభవి౦చాను నేను
ఆ పానుపుపైకొచ్చి ఆ స్వప్న౦ విడిచి నేనే నాకన్నులుగా ఓకలగా తిలకి౦చిన
ఆ అ౦దాన్ని చూసాను నేను
ఆ స్వప్నాన్ని కవితగా చేయాలని స్వప్న౦లో అనిపి౦చిన నా మనసును
ఏమనుకోను నేను

ఆ క్షణములో నా జాగృతకారకమును, నా కనులు కనే కలలను
ఏమని అభివర్ణి౦చను నేను?

2 కామెంట్‌లు:

మరువం ఉష చెప్పారు...

మీరింత స్వాప్నిక జగత్తులో విహరించే విహారి అనుకోలేదు సుమీ. నిజమే ఈ శృగారమన్నది ఎంతో సున్నితమూ, మధురమూ అయిన భావన. అది వర్ణనలకి అందని అరిదైన వరం. మానసిక పరిపక్వతకి అదొక చిహ్నం.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

My sun sign is Gemini. I am the best dreamer. Sometimes it is more than the allowed dose. I must be careful with myself.