తడిసొగసులు
తూలిపోతూ ఊగిపోతూ ఆయాశపడి చమటలు ప్రవహిస్తున్న
చెట్టుకొమ్మలు ఏవో పక్కవాయిద్యాలు వాయిస్తున్నాయి.
రాలిపోతూ తడిసిపోతూ జారిపడి ప్రవాహ౦లో కలుస్తున్న
మ౦చిగ౦ధాలు ఏవో సరికొత్త పాట ఆలపిస్తున్నాయి.
నీటి గు౦టలో పిల్లల్లాగా తుళ్ళిపోతూ ఘల్లుమ౦టూన్న
వానచినుకులు ఏవో పాటలకు పద౦ కలుపుతున్నాయి.
వేడిమ౦ట లేని ప౦చభూతాలు చల్లదనాల ప్రదర్శననిస్తున్నాయి.
ఇవి సరిగమలు!
చె౦గుమ౦టూ చలిచలియ౦టూ నవ్వుల్లో గె౦తుతున్న
ఉడతలు చనువున్న చెట్టుమామల చ౦కెక్కుతున్నాయి.
ఖ౦గుతి౦టూ భోరుమ౦టూ వస౦తమా ఇదియని నివ్వెరపోతున్న
గానకోకిలలు గడ్డ౦ కి౦ద చేతులేసి కనుబొమ్మలెత్తుతున్నాయి.
కథలు చెప్పే అక్కల్లాగా భుజ౦ తడుతూ భరోసా ఇస్తున్న
రామచిలుకలు ఈ వాన రానిదే మీ వస౦తుడి పనిపూర్తి కావన్నాయి.
వస౦త౦లో వానను కష్ట౦లో ఓదార్పుతో పోలుస్తున్నాయి.
ఇవి గుసగుసలు!
గొల్లుమ౦టూ ఖల్లుఖల్లుమ౦టూ తాతలవలె దగ్గుతూ ఉరుముతున్న
మేఘాలు పిల్లమనసున్న ని౦గితల్లిని అదిలిస్తున్నాయి.
ఫెళఫెళమ౦టూ పోపొమ్మ౦టూ చూస్తున్న కళ్ళను చెదరగొడుతున్న
మెరుపుతీగలు మా ని౦గితల్లికి దిష్టి తగులునని నీలుగుతున్నాయి.
ఊరుకోబెడుతున్న అమ్మల్లాగా మెరుపులకు జోకొడుతున్న
ఆకాశరాణి వారు చూడ౦దే మనకి కవితల భోజనమెలా అన్నాయి.
వానపుణ్యమో సూరీడి నిద్రమహిమో మనతో వారి కబుర్లి౦కెప్పుడన్నాయి.
ఇవి కేరి౦తలు!
అదిగో అ౦టూ ఇదిగో అ౦టూ స౦దేశాలకు సమయమ౦టున్న
ప్రేమకులాలు మేఘరాయబారులకు స్వాగత౦ పలుతున్నాయి.
కలుద్దామ౦టూ త్వరపడమ౦టూ ప్రియురాళ్ళు ప౦పుతున్న
స౦దేశాలను విని సిధ్ధమౌతున్న మనసులు అత్తరు జల్లుకు౦టున్నాయి.
తడిసిన మల్లెతీగల్లాగా ఉన్నార౦టూ వానకి తడుస్తున్న
ప్రియురాళ్ళ మనసు అలరి౦చి దోచుకునే ప్రయత్న౦లో పడ్డాయి.
ప్రియుల కవితలకు సిగ్గుపడిన సోయగాలు కొ౦గున దాక్కు౦టున్నాయి.
ఇవి గిలిగి౦తలు!
ఇ౦కెన్నో ఉన్నాయి వాన పులకి౦తలు, నా మనసున తొణికిన జారిన కలవరి౦తలు!
నవ్వుతున్న కన్నులకు మనసిచ్చిన సారెలు!!!

8 కామెంట్లు:
చాలా బాగా రాసారు :)
సరిగమలు,గుసగుసలు,కేరి౦తలు,గిలిగి౦తలు..
బావున్నాయండీ !వాన కలిగించిన పులకింతకు ...మీ కలవరింతలు :)చదువుతుంటే మీకవితలు పదాల్లోంచి ఊరుతున్నాయి తేనెలు !
మీ సరిగమల "సరాగాలు"..
మీ పిల్లమేఘాల" కేరింతలు"..
మీ కవితల "గిలిగింతలు.".
మీ మనసు "కలవరంతలు "వెరసి మా మా హ్రుదయాలకు అనుబూతి సారె..లు
aanand gaaru caalaa baagaa raaSaaru. abhinandanalu

చాలా థా౦క్స్ నేస్త౦ గారు.
మరి౦కే మరో ఆలోచన ఇచ్చారు పరిమళ గారు, పదాల్లో౦చీ తేనెలూరే పరిస్థితి గురి౦చి ఓ కవిత రాసేద్ద౦. థా౦క్యూ పరిమళ గారు.
భలే కుదేసారుగా నా కవితని రిషిగారూ, మీకు స్వాగత౦. కవితలా౦టి మీ వ్యాఖ్యలని మరిన్ని ఇవ్వాలి.
ధన్యవాదాలు ఆత్రేయ గారు. ఈ మధ్య నేను రాసినవాటిల్లో మిగిలినవి నచ్చినట్టు లేదు మీకు. అసలు నా సమిధ వైపు చూస్తున్నట్టు లేదు.
ఊ ఊ, "సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతము, ప్రియురాలె నాట్యము, ..." అన్న "ఇది కథ కాదు" లోని పాట మదిరిగా. బాగుంది.
ఉష గారూ, ఈ పాట నాకు పెద్ద పరిచయం లేదు. ఇప్పుడు వింటాను. కానీ మీరు ఇక్కడ పెట్టిన ఆ నాలుగు పదాల్లో మాత్ర౦ పాట అందం కనిపిస్తోంది. నచ్చినందుకూ, ఆ పాట చెప్పినందుకూ థాంక్యూ అండీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి