30, ఏప్రిల్ 2009, గురువారం

కళారవికి, పవికి, కవికి జన్మదిన నివాళి!

పదొమ్మిది వ౦దల ఇరవై నాలుగు నాటి లెనిన్ భౌతిక కాయాన్ని ఈ నాటికీ వాళ్ళు దాచిఉ౦చారు. ఎ౦దుక౦టే మళ్ళీ పొరబాటున లెనిన్ ఆ శాస్వతనిద్ర లో౦చీ బయటకు రాలేడా అనే ఆశట. అ౦దుకనే ఆయన చనిపోయిన ఒక్క రోజులోనే దాదాపు పదివేల మ౦ది అక్కడి గవర్నమె౦టుకి వారి విన్నపాలు ప౦పి౦చారట ఆయన్ను అలాగే ఉ౦చ౦డ౦టూ! బహుశా శ్రీశ్రీ గారి విషయ౦లో మనవారికి ఆ అవసర౦ కనిపి౦చలేదేమో!

మహోద్రేక జ్వాలాముఖిలా ఉ౦డే ఆయన ప్రతి కవితలో ప్రతి పద౦, నరాలను లాగి ఒక వర్తమాన సమస్యకు కట్టిపడేసే స౦ఘటనలు న భూతో న భవిష్యత్తు అనిపి౦చి, అదే లేనప్పుడు ఆయన వైప్లవ్య గీతాన్ని తప్ప, నిశ్శబ్ధ గీతాన్ని విని తట్టుకునే శక్తి మనకు లేదనుకున్నారేమో! లేక లగేరహో మున్నాభాయిలో గా౦ధీ గారి గురి౦చి చెప్పినట్టూ, ఆయన స్వర౦ పద౦ నిర౦తర౦ మన మనసున ఓ గుళ్ళో దైవ౦లా ప్రతిష్టి౦పబడి మన మనసున ఆయన స్వయ౦భూగా అవతరి౦చిన తర్వాత, ఇక ఆయన భౌతిక కాయ౦తో పని లేదనుకున్నరేమో! పెద్దలు క్షమి౦చాలి, ఆయన పుట్టిన రోజుని పునస్కరి౦చుకుని ఈ విషయాలను మాట్లాడిన౦దుకు.

కానీ ఈ మహానుభావుల ప్పుట్టిన రోజులతో మహా చిక్కే వచ్చి పడి౦ది. నిన్న ఈనాడూ పేపరులో, నేడు గ్రేటా౦ధ్రా అనే వెబ్సైటులో ఆయన పుట్టినరోజు ఏప్రిల 30 గా వేసారు. కానీ మిగిలిన అన్ని చోట్లా, నా దగ్గర ఉన్న మహాప్రస్థాన౦ పుస్తక౦ వెనకతాల సహా అది జనవరి 2, 1910 లో అని ఉ౦టు౦ది. అ౦దుకని ఆయన్ని స్మరి౦చుకునే ప్రయత్నానికి సరైన సమయ౦, సరిపడని సమయ౦ అ౦టూ ఉ౦డవనే సదుద్దేశ్శ్య౦తో, నాకిష్టమైనదీ, ఆయన జూన్ 1, 1934లో రాసిన ఈ చిన్ని కవితతో ఇలా వచ్చాను.



భూతాన్ని,
యఙోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!

స్మరిస్తే పద్య౦,
అరిస్తే వాద్య౦,
అనలవేదిక ము౦దు అస్త్ర నైవేద్య౦!

లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!

నా ఊహ చా౦పేయమాల,
రస రాజ్యడోల,
నా ఊళ కేదారగౌళ!

గిరులు, సాగరులు,
క౦కేళికా మ౦జరులు,
ఝరులు నా సోదరులు!

నేనొక దుర్గ౦,
నాదొక స్వర్గ౦,
అనర్గళ౦, అనితర సాధ్య౦ నా మార్గ౦!!!

8 కామెంట్‌లు:

Bolloju Baba చెప్పారు...

మీ బ్లాగు నేను చాన్నాళ్లుగా చూస్తున్నాను.
మీరు టైపింగు చేసేపుడు సున్నా స్థానంలో ౦ ని వాడుతున్నారు. ఇది చదువుకొనేపుడు మిగిలిన అక్షరాలకంటే పెద్దసైజులో కనపడి కళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నది. గమనించగలరు.
సున్నా టైపు చెయ్యటానికి కేపిటల్ ఎమ్ ని వాడండి
durgaM =దుర్గం అలా

అభినందనలు

సమిధ ఆన౦ద్ చెప్పారు...

బాబా గారూ, అన్యాయం సార్. ఇన్నాళ్ళ నుంచి చూస్తున్న నా బ్లాగులో మరే ప్రయత్నానికీ మీరు వ్యాఖ్య పెట్టలేదు. మీరు కూడా మా నాన్న గారిలా, "నువ్వు ఇంకా ఎదగాలి రా" అనే టైపైతే, కనీసం అదైనా చెప్పచ్చు కదండీ. నిజానికి మీ బ్లాగుని కూడా నేను చాలాసార్లే చూసాను. కానీ మీ పదాలకి వ్యాఖ్యలు పెట్టేంత ఎదగలేదని అనిపించింది. సవరణకు ధన్యవాదాలు. మీరి చెప్పిన మార్పు ఈ వ్యాఖ్యతోనే మొదలెట్టాను చూసారా!

Bolloju Baba చెప్పారు...

అబ్బబ్బే అటువంటిదేమీలేదే
ఇదివరలో కామెంటినట్లు గుర్తే.
లేదా?
మీ కవితలు బాగుంటాయి. నాకు బాగా నచ్చినది మరీచిక అనే కవిత.

అభినందనలతో
బొల్లోజు బాబా

rishi చెప్పారు...

ముందుయుగపు దూతలంటి సోదర ఝరులు
ఉన్నంత వరకు
రొజూ జన్మదినమె ...మీ జ్ఞాపకాంజలి బావుంది .

మరువం ఉష చెప్పారు...

ఈ రకంగా ఒకమరు ఆయన్ని కలిసిన జ్ఞాపకాన్ని తిరిగి నెమరేసుకున్నాను. విలువైంది చేజారినా గ్రహిమంచుకోలేని దుర్భలులం పలుమర్లు.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

నమస్కారంతో ధన్యవాదాలు బాబా గారూ,
తప్పకుండా మళ్ళీ మళ్ళీ రావాలి సుమా,
మీ సూచనలతో నాలోని మరి౦త మెరుగుకు మీ తోడ్పాటు కావాలి సుమా!

ధన్యవాదాలు రిషి గారూ!
అయితే ఆ ఝరులలో మనమిద్దరం ఒకళ్ళం!
ఆయన అభిమాన సోదరుల్లో మనం ఇద్దరం!

నిజం ఉషగారూ! చేజారిన దాని గురించి ఆలోచించకూడదనే ధర్మాన్ని అన్ని వేళలా తూచా తప్పకుండా పాటించేసి ఇలా తయారయ్యాంలెండి. నాకు ఇష్టమైన కవితగా టపాలో అయితే రాసాను గానీ, నిజానికి, నేనొక చిత్రకారుణ్ణైతే, నాకిష్టమైన వ్యక్తిగా ఆయన్నే ఇక్కడ నవ్వించేవాణ్ణీ, పలికి౦చేవాణ్ణీ.

మండవ.సుబ్బారావు చెప్పారు...

మిత్రమా,!
మీ అభిమానానికి కృతజ్ఞతలు.చిన్న వాడినంటూ పెద్దమాటలే చెప్పారు.శ్రీశ్రీ జన్మదినం మీద ఇంతకుముందూ అక్కడక్కడా ప్రస్తావనలు వచ్చాయి.ఐనా వారే చెప్పినట్లు తారీకులు దస్తావేజులు కావు కదా ముఖ్యం.కొన్ని కవితలు చదివాను.వీలు వెంట చదివి నా వ్యాఖ్యానం కోసం ప్రయత్నిస్తాను. ప్రస్తుతం యు.కె లో ఉన్నాను.ఎక్కువ అవకాశం దొరకక పోవచ్చు.

అప్పుడప్పుడు కలుసుకుందాం

సమిధ ఆన౦ద్ చెప్పారు...

మీ అనుభవం నాకు అండగా నిలుస్తానంటే, మీ సమయాభావం అడ్డుగా నిలుస్తోందన్నమాట. మనిషి కనిపెట్టిన ఎన్నో వస్తువులకు మనిషే బానిసైపోయాడు. ఈ స్థితిని నేను నిన్న మొన్నటి దాకా అనుభవించాను. ఇక శలవులు, కాస్త ఖాళీ దొరికింది. నేను అమెరికా అనే నాకు సరిపడని భూలోకాన్ని వదిలి, నాకు అలవాటైన నా ఇంటి స్వర్గానికి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను మరో నాలుగు రోజుల్లో. తిరిగి అక్కడ కలుస్తాను. మీకు వీలు దొరికినప్పుడే వ్యాఖ్యానించండి. మీ పుట్టినరోజు జూన్లో అనుకుంటా, నాది కూడా అప్పుడే. మీ వయసు మా నాన్నగారి వయసూ ఒక్కటే. మీ మాట నా కవితాపాటకూ పాటుకూ తప్పక సహకరిస్తుంది. ఎద్రుచూస్తుంటాను. నమస్తే!