10, ఫిబ్రవరి 2009, మంగళవారం

ముద్ర

కెంపులు అరవంకలు
వడ్డాణపు నడుమొంపులు
కాలి అందియలలో ఇంపులు
కన్నులు, కాటుకలు
కురులు, పూలజడల అరమరికలు
అడుగులలో మయూరాలు
నడకలలో
వయారాలు
చూపులలో సితారాలు
కుడి ఎడమల క్రీగంటి చూపులు
జతులు, గతులు,
ముద్రలు
పదనిసలలో సరిగమల పలుకులు
అందె అందెలో గుండె సవ్వడులు
తకిట తకధిమి తకిట తకఝణులు
చేతి వేళ్ళలో ఎన్ని కమలములు
పరమపదములో ఎన్ని అర్ధములు
అలల కళలలో ఎన్ని మెరుపులు
సరస నడకలు, నడుము విరుపులు
ఇన్ని వెరసి నీ నృత్య భంగిమలు
నీ పాదములకే నా హృదయ
సంపెంగలు

2 కామెంట్‌లు:

Sky చెప్పారు...

సోదరా,
నేను చెప్పిన వెంటనే తెలుగులో బ్లాగటం మొదలుపెట్టినందుకు ముందుగా నా ధన్యవాదములు. బ్లాగు అందంగా వుంది- అభినందనలు.

తెలుగు భాష మీద మీకు వున్న ప్రేమ మీ " నా గురించి" చదివిన తరువాత అర్ధం అయ్యింది.- మరీ అభినందన- తెలుగు బ్లాగ్ లోకం తరఫున.

మీ కొత్త బ్లాగ్ కి నేను మొదటి వ్యాఖ్య రాస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది.

మీ భావాలను అక్షరీకరించిన తీరు అద్భుతంగా వుంది. కళ్ళు మూసుకుని మీ కవితను ఊహిస్తే శాస్త్రీయ నృత్యం చేస్తున్న పడతి కళ్లముందు కనిపిస్తోంది. ప్రత్యక్షంగా చూసిన మీరు అదృష్టవంతులు.

మీరు మరిన్ని కవితలను ఇక్కడ త్వరలో రాస్తారని ఆశిస్తూ....

సతీష్ యనమండ్ర

సమిధ ఆన౦ద్ చెప్పారు...

అ౦ద౦ గురి౦చి ఆలొచి౦చేవాడికి తప్పులు కనిపి౦చవు. తప్పుల కోస౦ వెతికేవాడికి అ౦ద౦ కనిపి౦చదు.
అ౦దాన్నీ అనుభవిస్తూ అవసరమైనచోట సవరి౦చగలిగిన వాడికి కావాల్సిన కల౦ పుస్తక౦ లాగా రె౦డు వస్తువులు.
అవి అర్హత-అనుభవ౦!
ఈ రె౦డూ అమిత౦గా ఉన్న మీలా౦టి వారు ఆదరి౦చి ఇదే ఊపునిస్తే, ఏమో, ఎవరికెరుక, ఇ౦కో పాతికేళ్ళకి నేను కూడా ఓ కృష్నశాస్త్రినే అవ్వగలనేమో!
అక్షరానికి నేను వాహనాన్నే కాని, నన్ను నడిపి౦చాల్సి౦ది మీలా౦టివారే కదా!
నా సమిధకు మీ స్ఫ్హూర్తే తాయిల౦.
మీ అభిన౦దనకు నా కృతఘ్న్యత సమాధాన౦.......

మీ సొదరుడు,
ఆన౦ద్