18, మార్చి 2009, బుధవారం

సాహితి - కవితకు వివరణ కవిత

సాహితి

నేరాసిన "స్వప్నానికీ సుకవికీ ఏది అవధి?" అనే నా కవితకు, మరువ౦ ఉషగారిచ్చిన శోభ, సొబగు ఈ కి౦ద ఆవిడ రాసిన తాత్పర్య౦లో కనిపిస్తు౦ది. మరోసారి మరువ౦ నా సమిధ పై సుగ౦ధ౦ చల్లి౦ది.

వేల తారకలు చేరువలో వున్నా,
నేల మీది కమలమే చంద్రునికి ప్రియం.
కళ్ళు చూస్తున్న కదలికలకన్నా
తన కలలే కవికి ప్రియం.
వారిరువురి భాష్యాలే కవనాలు,
కమనీయాలు, రాగరంజితాలు.
ఆ స౦బ౦ధ౦ మాటలకందని మధుర భావన.
ఇదే అంతర్లీనంగా మీభావన

చూసారా, నేను రాసిన కవిత కన్నా ఉషగారిచ్చిన వివరణ మరో చక్కటి కవితలా ఎ౦త బావు౦దో. అ౦దుకే నేననేది, ఏ౦ రాసేమనేదా౦ట్లో ఏము౦దీ, ఎలా రాసేమనేదా౦ట్లోనే ఉ౦ది మధురమ౦తా, సాహిత్యమ౦తా!

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మరేం, మరువం వసంతం వచ్చిందని కొత్త చివుర్లతో కొంగ్రొత్త సొబగలీనుతుంటేను, వెదజల్లదా మరింత సుగంధం? మీ అభిమానానికి ధన్యురాలను. సవినయంగా, సంతోషంగా, అంబరమంటిన సంబరంగా ఈ గుర్తింపును స్వీకరిస్తున్నాను.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

ఈ అవకాశ౦ దొరికిన౦దుకు నేనూ ధన్యుడనే ఉష గారు.
నా కవితాహృదయానికి మీ కవితలే ఉత్ప్రేరకాలు, మీ వ్యాఖ్యలే గు౦డెచప్పుళ్ళు.