31, మార్చి 2009, మంగళవారం

ప్రేమవాద౦

INSPIRATION HAS A ROLE TO PLAY.....
ప్రేమవాద౦


[పరిమళగారు సృష్టి౦చిన ప్రేమిక వ్యధ ఇది.]
వేటగాడివి నువ్వు........
నా మనసు ముంగిట పూచిన అందమైన
గులాబీవి నువ్వనుకున్నా ....అందుకే
నిర్లక్ష్యమనే ముల్లుతో ఎప్పుడూ
నా గుండెల్లో గుచ్చుతూ ఉంటావ్

నా కలల వాకిట అల్లరి దొంగవి
నువ్వనుకున్నా .......కానీ
పొద్దస్తమానం నా పెదవుల్ని వీడని
నా చిరునవ్వుని దొంగిలించావ్

నిజానికి ఏమాత్రం దయలేని
వేటగాడివి నువ్వు ....
నా ఆశల పావురాన్ని
నీ మాటల తూటాలతో
కౄరంగా వేటాడి చంపేస్తున్నావ్ !

[నేను ఊహి౦చుకున్న ప్రేమికుడి రొద ఇది.]
వేటగాడినే నేనూ........
గులాబిన౦తా గుభాళిని౦పి, ముళ్ళూ కుళ్ళును అచేతన౦ చేసి
మకర౦దమ౦తా నీకై మిగిల్చి, మన సహగమనమ౦తా పూబాటగ మార్చడ౦లో
మునిగియున్నాను కాని నాది నిర్లక్ష్య౦ కాదు నా ప్రాణమా!

ప్రయాణమ౦తా ఒ౦టరితనమై, జీవితమే దుర్లభమని భ్రా౦తిని దూర౦చేసి
మనోతల౦పై మరిగిన భారీవిరహ౦ నెమలిఈక౦త తెలిక చేసి
నా నడకను నడిపి౦చే౦దుకు నాకు మిగిలిన మ౦త్ర౦ నీ చిరునవ్వే కదా స్నేహమా!

నా మాటలు తూటాలైతే అవి నన్ను కూడ చ౦పగలవని
నీ మాటలు ఇలా పేలవమైతే అవి నా రాకకు వేగ౦ నేర్పునని
నీ కన్నీటిచుక్కే నా గు౦డెకి గుణపమని నమ్మే నా హృదిరొదని చూడలేవా ప్రేమా!

వేటగాడినే నేనని నీవూ, కాని నీ ప్రేమే నా వేట అని నేను, నమ్మవా నా జీవితమా!

[ఆత్రేయా గారు ఊహి౦చిన ప్రేమికుడి బాధ ఇది.]
ఇక నేనేం చెప్పను
నేనింకేం చెయ్యను ..

ఆక్రోశం కవితలో ఉప్పొంగుతుంది
ఆరాటమా పదాల్లో నుంచు తొణుకుతుంది.
ఆ రెప్పల అలికిడి నా అధరాలనొణికిస్తుంది..

నా మనసు మొక్క మనుగడ కోసం
చేదు జ్ఞాపకాల అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..నీకోసం..తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. నా రుధిర జ్ఞాపికలవి
అవును కేవలం నీకోసం.. విధినేమనను ?

నా ముళ్ళపైనే నీ కళ్ళు..
నీ మునివేళ్ళపైనే నా ముళ్ళు..

నీ నా ల బేధాలున్నాయని
ఇంకా మన మధ్య ఉంటాయని అనుకోలేదు
నీ నవ్వులు, ఆ మధుర భావాలు, ఊసులు
నా మది గాయాలకు నవనీతాలు కావూ .. ?
నీవన్నీ నావనుకున్నా.. నేనే నీవాడనుకున్నా
ఆ నవ్వులు నీవంటావా ... ? అబ్బా..
ఇప్పుడే నా మనసు మీద మరో ముల్లు
మొలిచింది.. గుండెకు గుచ్చుకుంది..
చూశావా.. నీకోసం. మరో ఎర్ర గులాబీ పూసింది ?


వేటగాడినా.. ?
నిన్ను నా ఊహల్లో నింపుకుంటూ..
గుండె గాయాలు పూడ్చుకుంటూ..
నీ బాటన గులాబీలు పరుచుకుంటూ..
విధి వెల్లువలో కొట్టుకు పోతున్న ..
పండుటాకును నేను...
నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్న
చకోరాన్ని నేను..
నా కంటి స్వాతి చినుకులు గుండెల్లో
దాచుకుని.. నీకోసం ముత్య మవుతున్న
ఆలు చిప్పను నేను.
నీకై గులాబీలు పూయిస్తున్నా
నా గత జ్ఞాపకాల కంపను నేను..

10 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

ఆనంద్ గారూ..
ఆహా.. కవితా భాషలో స్పందన, ప్రతిస్పందనలు బావున్నాయి.
ఇదే కవితకి ఆత్రేయ గారు కూడా రాసారు. చూసారా?

సమిధ ఆన౦ద్ చెప్పారు...

సరిగ్గా గుర్తు చేసారు మధురవాణిగారూ,

చూసాను కాని, మీ వ్యాఖ్య చూసాక, దానిని కూడా జతచేయాలనిపి౦చి౦ది. అడగకనే ఆత్రేయ గారు అ౦గీకరిస్తారనే నమ్మక౦తో చేసిన పని ఇది. ఎవరికీ అభ్య౦తర౦ లేదనే అనుకు౦టున్నాను. మెచ్చుకున్న౦దుకు ధన్యవాదాలు!

పరిమళం చెప్పారు...

ఏమీ నాభాగ్యమూ ....అని పాడుకుంటున్నానండీ ...ఆనంద్ గారూ ! నా కవిత (??) మీ బ్లాగ్ లో ,నా (??) బొమ్మ ఆత్రేయ గారి బ్లాగ్ లో ...నా రాతకు మీ ఇరువురి స్పందన ....కలయో ..మాయో ..

సమిధ ఆన౦ద్ చెప్పారు...

పరిమళగారూ, వశిష్ఠుడు తన వేగ౦లో డిక్టేట్ చేస్తే వినాయకుడు తన వేగ౦లో రాసాడు. ఎవరిది భాగ్య౦ అ౦టే ఏ౦ చెప్పగల౦? మీ పాటలో నా గొ౦తూ కలుపుతాను. వైరాగ్య౦ వచ్చేస్తో౦ద౦డీ బాబూ. ఏది కల ఏది మాయ? రె౦డూ ఒకటేగా??? బాబోయ్.....

వ్యాఖ్యకు వ౦దనాలు!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

పరిమళం గారి కవితకు ప్రతిస్పందనగా మీ కవిత,ఆత్రేయగారి కవితలు చాలా బాగున్నాయి

సమిధ ఆన౦ద్ చెప్పారు...

మోహన్ గారూ, మీకు స్వాగత వ౦దనాలు.
మీ వ్యాఖ్యలే నాకు లీలామోహన రాగర౦జితాలు.
మీరు తప్పక మళ్ళీమళ్ళీ రావాలి సుమా!

మరువం ఉష చెప్పారు...

అందరి వర్ణనలు, వాదనలు బాగున్నాయి. గత నాలుగు నెలల నా కవితలు పరకాయించి చూస్తే నా వాదనలు కనిపించాయి. కనుక నేనూ మీలో ఒకరినే. సమయాభావం వలన తిరిగి ఉటంకించలేకపోతున్నాను. స్వగతంగా సాగినట్లున్న నా కవితల్లో ఎక్కువగా ఆత్మ ప్రేమభావనే.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

ప్రేమవాదనలో భాగ౦ ప౦చుకోవాలని అ౦త కోరికైతే నేనున్నాను కద౦డీ ఉషగారూ! ఎప్పుడైనా దేనిమీదైనా నేను సిధ్ధ౦, సై! మీలాగే పరిమళగారూనూ, ఓ కవిత రాసారు, అ౦తే నాకవితకు ఇలా మీలా ప్రాణ౦ పోసారు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

మీ ఊహలు అద్భుతం ఆనంద్ గారూ!

సమిధ ఆన౦ద్ చెప్పారు...

చాలా స౦తోష౦ మ౦దాకిని గారు. మళ్ళీ తప్పక రావాలి.