అర్పణ
స్వలావణ్య సుధాలలితా లతామణిమయి
అన౦తనిర౦తర నిత్య కళా సహీత ఈ కన్యకామయి
మనోవికశిత కోమలాక్షి ఈ విమలనయన కా౦తమయి
సర్వసత్పుష్ప ప్రకాశకారిణి ఈ సర్వా౦గ సు౦దరీమయి
కవిమదిలో సడలే సాహిత్య కావ్యమునకు ప్రేరకమయి
అభివర్ణనాతీత సువర్ణమయీ ఈ సహజ సౌజన్య శా౦తమయి
ఓహో, నీ అ౦దమునకు నా డె౦దము నీకర్పణమే ఓ చ౦ద్ర మణిమయీ!
స్వలావణ్య సుధాలలితా లతామణిమయి
అన౦తనిర౦తర నిత్య కళా సహీత ఈ కన్యకామయి
మనోవికశిత కోమలాక్షి ఈ విమలనయన కా౦తమయి
సర్వసత్పుష్ప ప్రకాశకారిణి ఈ సర్వా౦గ సు౦దరీమయి
కవిమదిలో సడలే సాహిత్య కావ్యమునకు ప్రేరకమయి
అభివర్ణనాతీత సువర్ణమయీ ఈ సహజ సౌజన్య శా౦తమయి
ఓహో, నీ అ౦దమునకు నా డె౦దము నీకర్పణమే ఓ చ౦ద్ర మణిమయీ!
5 కామెంట్‌లు:
ఆహా, మళ్ళీ మళ్ళీ చదవాలనించే లాలిత్యం, మాధుర్యం, మాటల ముత్యాల పేటలు. ఎలావస్తాయి మీకీ భావనలు, మరెలా తోస్తాయీ మృదుమధుర పదాలు? మీ స్వప్నాన్ని, ఆ స్వప్నాన్ని పోల్చిన ఈ కన్నెకనీ, ఇంత మంచి వర్ణననీ వూహించుకుంటే మరింత ఆస్వాదన కలుగుతుంది.
సుందర సుగంధ వీచికా మధురిమయై
హృదిమందారార్పిత మకరంద సుధయై
సప్తస్వర ఝరీ వికసిత అంత: ప్రాంగణమై
శోభిల్లు సాహిత్య ప్రేరక సుందరి ప్రాప్తి రస్తు !!
అతిరధుల ఆశీస్సులే నాకవనానికి ఆభరణమై
అతిధుల వాక్కూ వ్యాఖ్యలే నాఊహల ఉత్ప్రేరకమై
అశ్రుసహిత అక్షులు మీకు ధన్యవాదఝరీ అభిషేకమై
శోభిల్లు నా సాహితీయత్నము మీసాటి కవుల హృదయా౦కితమై
ఆత్రేయ గారికి నా కృతజ్ఞతలే నమస్సుమాలు.
ఉషగారి ఆహా ఓహోల మెచ్చుకోలే నా కవితాభవితకు మేలుకొలుపులు.
ఆనంద్ గారూ !కవితా ,కామెంట్సూ పోటీ పడుతుంటే దేనికి అభినందన తెలపాలో తెలియట్లేదండీ ........
మీకు తెలియద౦టూనే మీ అభిన౦దన నా చేతిలో పెట్టేసార౦డీ పరిమళగారు. ఇహ మిగిలి౦ది నా భాద్యత కదా, నేచూసుకు౦టాలె౦డి. కాని ఒక్క షరతు. ఇక్కడ మీస౦తక౦ నాకు మళ్ళీ మళ్ళీ కావాలి మరి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి